అయోధ్య కేసులో సుప్రీం సంచలన తీర్పు

Author:

అయోధ్య కేసులో అత్యున్నత ధర్మాసనం సుప్రీం కోర్టు సంచలన తీర్పు ప్రకటించింది. ప్రస్తుతం వివాదం నెలకొని ఉన్న స్థలంలో 2.77 ఎకరాలను అయోధ్య ట్రస్టు బోర్డుకు అప్పగించాలని, మసీదు నిర్మాణం కోసం ముస్లిం బోర్డుకు మరో చోట స్థలం కేటాయించాలని, వివాదాస్పద భూమిని ఎవరికి పంచేది లేదని సుప్రీం తీర్పు ప్రకటించింది. మసీదు నిర్మాణానికి స్థలం ఎక్కడ కేటాయించాలో కేంద్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకోవాలని… మూడు నెలల్లో ప్రత్యేక ట్రస్టు ఏర్పాటు చేయాలంది సుప్రీం.

సుప్రీం కోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ రంజన్ గగోయ్ అయోధ్యపై చదివిన తీర్పు యధాతధంగా..

వివాదాస్పదంగా ఉన్న భూమి తమదేనని షియా బోర్డు పిటిషన్ వేసింది. షియా బోర్డు వేసిన పిటిషన్ ను కొట్టేస్తున్నాం. 5గురు జడ్జిలు ఏకాభిప్రాయంతో తీర్పును వెలువరిస్తున్నాం. బాబ్రీ మసీదు ఎప్పుడు కట్టారో అన్న దాని పై సరైన వివరాలు లేవు. బాబర్ కాలంలో బాబ్రీ మసీదు నిర్మించారని చరిత్ర ద్వారా తెలుస్తోంది. రాముడు అయోధ్యలో జన్మించారని హిందూవుల విశ్వాసం. మతపరమైన విషయాల్లో కోర్టు జోక్యం చేసుకోదు. నిర్మొహి అకాడ వేసిన పిటిషన్ ను కూడా కోర్టు నిర్మొహమాటంగా కొట్టేస్తున్నాం. ఖాళీ ప్రదేశంలో బాబ్రీ మసీదు కట్టలేదు. బాబ్రీ మసీదు కింద కట్టడం ఉంది. 12 నుంచి 16 శతాబ్దాల మధ్య అక్కడ ప్రార్ధన మందిరాలు ఉన్నాయని స్పష్టమవుతోంది. అది దేవాలయం అని చెప్పడానికి ఆధారాలు లేవు. దేవాలయాన్ని ధ్వంసం చేశారనడానికి పురావస్తు ఆధారాలు లేవు. నమ్మకం విశ్వాసం ఆధారంగా భూ యాజమాన్యాలను నిర్ణయించలేం.ఈ నమ్మకాలకు విలువ ఇవ్వాలా వద్దా అనేది కోర్టు పరిధిలో లేదు. 1949లో బాలరాముడి విగ్రహాలు పెట్టారు. విగ్రహం పెట్టడం అంటే మత దూషణ కిందకే వస్తుంది. ముస్లింలు ఎప్పుడూ మసీదును వదిలేయలేదు. వివాదాస్పద స్థలం తమదేనని ముస్లింలు నిరూపించుకోలేకపోయారు. రామ్ ఛబుత్రా, సీతారసోమ్ దగ్గర గతంలోనే పూజలు చేసేవారు. బాబ్రీ మసీదు కూల్చివేతను చట్టం అనుమతించదు. మత విశ్వాసాలతో మాకు సంబంధం లేదు. అలహాబాద్ హైకోర్టు తీర్పును తప్పుపడుతున్నాం. మసీదు నిర్మాణం కోసం ముస్లింలకు ప్రత్యామ్నాయం స్థలం కేటాయించాలి. మసీదు నిర్మాణం కోసం సున్నీ వక్ఫ్ బోర్డుకు 5 ఎకరాల ప్రత్యామ్నాయ స్థలం కేటాయించాలి. అయోధ్య ట్రస్టు బోర్డుకు వివాదాస్పద 2..77 ఎకరాలను అప్పగిస్తున్నాం. వివాదాస్పద భూమిని ఎవరికి పంచేది లేదు. 3 నెలల్లో కేంద్ర ప్రభుత్వం అయోధ్య ట్రస్ట్ బోర్డు ఏర్పాటు చేసి ఆ భూమిని వారికి అప్పగించాలి. అయోధ్యలో రామమందిర నిర్మాణానికి అనుమతిస్తున్నాం. వివాదాస్పద స్థలం రాంలాలాకే చెందుతుంది. అని ఆయన తీర్పునిచ్చారు.

 

 

Comments

comments